Minister Seethakka : కొమురం భీం జిల్లాలోని కెరమెరి మండలంలోని జంగుబాయి జాతర ఘనంగా జరుగుతున్నది. ఈ జాతరలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క గిరిజన సంప్రదాయ చీరకట్టులో పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన మహిళలు గోలుసు, కడియాలు, చీరకట్టులో పాల్గొని తమ సంప్రదాయాన్ని ఉత్సవంగా జరుపుకున్నారు. మంత్రితోపాటు, ఎమ్మెల్యే కొవ్వ లక్ష్మి కూడా ఆదివాసీ సంప్రదాయ వేషధారణలో జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మంత్రి సీతక్క జంగుబాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులైన కటోడాలను సన్మానించారు.…