గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. హీరోగా నటిస్తున్న గౌతమ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రచయితగా కూడా పని చేస్తున్నారు. జికే ఫిల్మ్ ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లపై మనోజ్, డి.జె. మణికంఠ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జుడా సంధి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ‘ఆకాశ వీధుల్లో’ చిత్రం నుంచి విడుదలైన “అయ్యయ్యయ్యో’ లిరికల్ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుంచి…