విధి నిర్వహణలో నిర్లక్ష్యం, మితిమీరిన ప్రవర్తనతో ఏపీలోని కొందరు పోలీసు అధికారులు క్రమశిక్షణా చర్యలకు గురవుతున్నారు.తాజాగా కృష్ణా జిల్లాలో ఓ ఎస్ఐ సస్పెండ్ అయ్యారు. కృష్ణా జిల్లా రేపూడి తండాకు చెందిన లకావత్ బాలాజీ ఆత్మహత్య ఘటనలో ఎ. కొండూరు (A,Konduru) ఎస్సై టి.శ్రీనివాసును సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ. నిన్న ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన బాలాజీ.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాటుసారా కేసులో విచారణ పేరుతో ఎ.కొండూరు ఎస్సై టి.శ్రీనివాస్ విచక్షణారహితంగా దాడి చేసిన…