హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో సంచలన ఘటన వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీని కొట్టి చంపినందుకు గాను గోసంరక్షక బృందానికి చెందిన ఐదుగురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఫ్ మాంసం తిన్నాడనే అనుమానంతో నిందితులు సబీర్ మాలిక్‌ను ఆగస్టు 27న హత్య చేశారు.