కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మరోసారి ప్రమాదకర వైరస్‌లు వెలుగుచూశాయి. కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకిందని వస్తున్న వార్తల నేపథ్యంలో కొంతమంది శాస్త్రవేత్తలు చైనాలోని జంతువుల మాంసం విక్రయించే మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు జరిపారు. ఈ పరిశోధనల్లో ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, బెల్జియం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 16 రకాల జాతులకు చెందిన 1725 వన్యప్రాణులపై వారు పరిశోధనలు జరిపారు. అయితే ఈ పరీక్షల్లో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఒకటి కాదు.. రెండు…