తెలంగాణపై గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.. హైదరాబాద్‌లో గంటల తరబడి ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురుస్తుండగా.. జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇవాళ తెల్లవారుజాము నుంచే భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.. మధ్యాహ్నం వరకే తెలంగాణలో 15 సెంటీ మీటర్లు, హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 3.3 సెంటీ మీటర్ల వర్షం నమోదు కాగా.. రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,…