NTV Telugu Site icon

Heat wave Forecast: మేలో నిప్పుల కొలిమి.. ఆ రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

Heat Waves

Heat Waves

దేశంలో కురుస్తున్న వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతోంది. అయితే, మే నెలలో మాత్రం దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణం కనిపిస్తుంది. తూర్పు మధ్య, తూర్పు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read:Traffic restrictions: రేపు కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. ఆ రూట్లల్లో వెళ్లి పరిషాన్‌ అవ్వకండి

భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మే నెలలో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండి తెలిపింది. వాయువ్య,పశ్చిమ-మధ్య భారతదేశంలో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం నుండి సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్, ఒడిశా,ఉత్తరప్రదేశ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు ఉంటాయిని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షం కారణంగా, వాతావరణం పొడిగా ఉంది. ప్రజలు వేడి గాలుల నుండి కూడా ఉపశమనం పొందారు. ఏప్రిల్ ప్రారంభంలో, వాతావరణ శాఖ వేడి కారణంగా చాలా ప్రాంతాల్లో హెచ్చరిక జారీ చేసింది. దీనితో పాటు, ఫిబ్రవరి నెలలో వేడి అనేక రికార్డులను కూడా బద్దలు కొట్టింది.