NTV Telugu Site icon

Zimbabwe Cricket: జింబాబ్వే క్రికెట్‌లో విషాదం.. కోచ్‌లైన దంపతులు హఠాన్మరణం

Zimbabwe Cricket Couple

Zimbabwe Cricket Couple

Zimbabwe Cricket Mourns Women Assistant Coach Tragic Death: జింబాబ్వే క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం రోజుల వ్యవధిలోనే.. పురుషుల, మహిళల జట్లకు కోచ్‌లుగా వ్యవహరిస్తున్న దంపతులిద్దరు హఠాన్మరణం పొందారు. తొలుత జింబాబ్వే క్రికెట్‌ పురుషుల జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ అయిన షెఫర్డ్‌ మకునురా (46).. గతేడాది డిసెంబర్‌లో 15వ తేదీన అనారోగ్యం కారణంగా మరణించాడు. షెఫర్ట్ మృతి నుంచి అతని కుటుంబ సభ్యులు కోలుకోవడానికి ముందే.. అతని భార్య, జింబాబ్వే మహిళా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ సినికివె ఎంపోఫు (37) తిరిగిరాని లోకాలకు వెళ్లింది. తన నివాసంలో శనివారం కుప్పకూలిన ఈమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఇలా ఇద్దరు కీలక వ్యక్తులు అకస్మాత్తుగా దూరం కావడంతో.. జింబాబ్వే క్రికెట్ శోకసంద్రంలో మునిగిపోయింది.

Healthy Soups: శీతాకాలంలో వేడి వేడిగా ఈ సూప్స్ తీసుకుంటే..

సినికెవె మృతిపై జింబాబ్వే మేనేజర్ డైరెక్టర్ గివ్మోర్ మకోని మాట్లాడుతూ.. ఎంతో కఠోర శ్రమ చేసి ఆమె మంచి స్థాయికి చేరుకుందని, కానీ ‘చావు’ తమ నుంచి ఆమెను దూరం చేసిందని విచారం వ్యక్తం చేశారు. జింబాబ్వే మహిళా క్రికెట్‌లో సినికెవె ఆదర్శనీయమైన వ్యక్తిగా ఎదిగి, ఎందరో ఆదరాభిమానాలను చూరగొందని.. అలాంటి ఆమె ఇలా అర్ధంతరంగా వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని సంతాపం వ్యక్తం చేశారు. సినికివె, షెఫర్డ్‌ దంపతుల హఠాన్మరణం వారి కుటుంబాలతో పాటు తమక్కూడా తీరని లోటు అని భావోద్వేగానికి లోనయ్యారు. జాతీయ జట్టులో కీలకమైన ఇద్దరు సభ్యులను కోల్పోయామని.. ఇంతటి విషాదం మరెక్కడా ఉండదని వాపోయారు. కాగా.. 2006లో జింబాబ్వే తరఫున ఆడిన సినికెవె, ప్లేయర్‌గా కెరీర్‌ ముగిశాక కోచింగ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. అక్కడి నుంచి మహిళా జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ స్థాయికి ఎదిగింది.

Go First Flight: 50 మందిని వదిలేసి విమానం టేకాఫ్.. ప్రయాణికులు తీవ్ర అసహనం

Show comments