టొమాటో సూప్: ఇందులో విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం వుంటాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది, రక్తహీనతని నిరోధిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బేబీ కార్న్ సూప్: దీని వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతమవుతుంది. శరీర బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. చర్మానికి కూడా మేలు చేస్తుంది.
నిమ్మకాయ - కొత్తిమీర సూప్: ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మూత్రపిండాలు, మూత్రానికి సంబంధించిన వ్యాధులను నయం చేస్తుంది.
బ్రోకలీ సూప్: బ్రోకలీలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇందులో రోగనిరోధక శక్తిని బలపరిచే జింక్, సెలీనియం, విటమిన్-ఎ, సి వంటి పోషకాలూ ఉంటాయి.
మష్రూమ్ సూప్: మష్రూమ్‌లో విటమిన్లు, ఖనిజాలు, రాగి, పొటాషియం, ఫాస్పరస్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ సూప్ చర్మానికి మేలు చేస్తుంది.
బీట్‌రూట్ సూప్: ఈ సూప్ రక్తహీనతను నివారిస్తుంది. బీట్‌రూట్‌లో విటమిన్ ఎ, బి, సి, కె, ఇ ఉన్నాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం కూడా ఉన్నాయి.
పుల్లని పులుసు: అల్లం, వెల్లుల్లి, మొక్కజొన్న, కూరగాయలు, క్యారెట్, ఎండుమిర్చి, ఉల్లిపాయ మొదలైన వాటిని కలిపి దీన్ని తయారు చేస్తారు. దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
క్యాబేజీ సూప్: క్యాబేజీ, క్యారెట్, బఠానీలు, క్యాప్సికమ్‌లతో ఈ సూప్ చేస్తారు. ఈ సూప్ రెగ్యులర్‌గా తాగితే, శక్తి అందడంతో పాటు శరీర బరువు తగ్గుతుంది.