Site icon NTV Telugu

భారతజట్టులోకి మళ్లీ యువరాజ్ సింగ్..?

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువరాజ్ సింగ్ అంటే నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్, 2007 ప్రపంచకప్‌లో ఆరు సిక్సర్లు గుర్తుకురాక మానవు. ఆయా మ్యాచ్‌లలో యువీ అంతటి గొప్ప ముద్ర వేశాడు. అయితే మంగళవారం నాడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అభిమానుల కోరిక మేరకు మళ్లీ తనను మైదానంలో చూస్తారని హింట్ ఇచ్చాడు. 2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ మళ్లీ తనను ఫీల్డ్‌లో చూస్తారని చెప్పడం కొసమెరుపు. దీంతో అతడు మళ్లీ భారత జట్టులోకి వస్తాడంటూ పలువురు క్రికెట్ అభిమానులు ఆశపడుతున్నారు.

Read Also: కోహ్లీ కూతురుకు అత్యాచార బెదిరింపులు.. ఆ పని చేసినందుకేనా..?

కాగా యువరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘భగవంతుడు నీ గమ్యాన్ని నిర్దేశిస్తాడు. ప్రజల కోరిక మేరకు నేను వచ్చే ఫిబ్రవరిలో నేను మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇంతకు మించిన గొప్ప ఫీలింగ్ మరొకటి ఉండదు.. మీ ప్రేమ, అభిమానాలకు సదా కృతజ్ఞుడిని. మన జట్టు (టీమిండియా)కు మీ మద్దతు ఇలాగే కొనసాగాలి. నిజమైన అభిమాని.. కఠిన సమయాల్లో కూడా మద్దతుగా నిలుస్తాడు’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్టుతో పాటు తన కెరీర్‌లో చివరిసారిగా 2017లో ఇంగ్లండ్ జట్టుపై సాధించిన సెంచరీకి సంబంధించిన వీడియోను కూడా యువరాజ్ జతపరిచాడు.

https://www.instagram.com/p/CVv7NX3DKjg/?utm_source=ig_embed&ig_rid=7908dba1-ea88-454e-ab62-0257c80a409a

Exit mobile version