గుండెపోటుతో భారత యువ క్రికెటర్ మృతి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. యువ క్రికెటర్ అవి బరోట్ ఈరోజు గుండె పోటుతో మరణించాడు. అతడికి తల్లి, భార్య ఉన్నారు. అవి బరోట్ మరణ వార్తను సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సీఏ) ఈరోజు అధికారికంగా ప్రకటించింది. అయితే 29 ఏళ్ల అవి బరోట్ మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఎస్‌సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా మాట్లాడుతూ… అవి బరోట్ ఇంట్లో అస్వస్థతకు గురికాగా.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ లోపలే తుది శ్వాస విడిచాడు. అతనికి ఎంతో ప్రతిభఉంది. అతడు లేడన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నా’ అని అన్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లోనే 122 పరుగులు చేసి అందరిని ఆకర్షించారు. ఇక 29 ఏళ్ల అవి బరోట్ 2011లో అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అలాగే 2019-20 సీజన్ లో రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో అవి బరోట్ సభ్యుడు. తన కెరియర్ లో 38 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 38 లిస్ట్-ఏ, 20 దేశవాళీ టీ20 మ్యాచులు ఆడాడు. అయితే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 1547 పరుగులు, లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 1030 రన్స్ , టీ20లలో 717 పరుగులు చేశాడు.
Also Read
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
తాజావార్తలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
-
Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
-
ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?