NTV Telugu Site icon

CSK vs RR : దంచికొడుతున్న రాజస్థాన్.. 10 ఓవర్లకే..

Jaisawal

Jaisawal

ఐపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇరు జట్లు ముఖాముఖిగా తలపడడం ఇది రెండోసారి. మొదటి సారి రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుంది.

Read Also : Boy Kidnap: కరీంనగర్‌లో బాలుడు కిడ్నాప్ కలకలం..

రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో భారీగా పరుగులు చేసింది. ఓపెనర్స్ జైస్వాల్, జోస్ బట్లర్ ధాటిగా బ్యాటింగ్ చేసి 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ ను దాటింది. దీంతో సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోని వరుసగా బౌలర్లను మార్చిన ఫలితం రాకపోవడంతో రంగంలోని రవీంద్ర జడేజాను దించాడు. ఎనిమిదో ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన జడేజా వేసిన తొలి బంతికే జైశ్వాల్ సిక్స్ కొట్టాడు. ఆఖరి బంతికి సింగిలి తీసి 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

Read Also : Bopparaju Venkateswarlu: జీవో ఇచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ నిలిపేది లేదు..!

సెకండ్ ఓవర్ వేసేందుకు వచ్చిన రవీంద్ర జడేజా బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు జోస్ బట్లర్ ప్రయత్నించి లాంగాన్ లో ఉన్న శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. దీంతో 86 పరుగులకే ( 8.2 ఓవర్ ) వద్ద రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది.

Read Also : Heat Stroke : మీకు వడదెబ్బ తగిలిందా.. అయితే ఇలా చేయండి

ఇక పదో ఓవర్ వేసేందుకు వచ్చిన మొయిన్ అలీ బౌలింగ్ లో రెండో బంతికే జైశ్వాల్ సిక్స్ కొట్టాడు.. మొత్తం ఈ ఓవర్ లో 10 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ 100/1 మార్క్ కు చేరుకుంది. ఇక పదకొండో ఓవర్ వేసిన రవీంద్ర జడేజా మొత్తం 4 పరుగులు ఇచ్చాడు. 11వ ఓవర్ లో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ 105/1. యశస్వి జైశ్వాల్ ( 63 ), సంజు శాంసన్ ( 7) క్రీజులో ఉన్నారు.

పద్నాలుగో ఓవర్ కి బౌలింగ్ కి వచ్చిన తుషార దేశ్ పాండ్ బౌలంగ్ లోని తొలి బంతికే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ లాంగ్ ఆన్ దిశగా కొట్టడంతో రుతురాజ్ గౌక్వాడ్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో సంజు శాంసన్ 125 పరుగుల వద్ద అవుట్ కాగా.. ఇదే ఓవర్ లో ఐదో బంతి యశస్వి జైశ్వాల్ బ్యాట్ ఎడ్జికి తాకడంతో పైకి లేచింది. దీంతో అజింక్యా రహానే క్యాచ్ పట్టుకోవడంతో జైశ్వాల్ (43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు ) 132 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు స్కోర్ య132/3 గా ఉంది.

Read Also : We Love Reading: పఠనాసక్తి పెంచేందుకు విద్యాశాఖ శ్రీకారం.. వేసవి సెలవుల్లో అమలు..

తీక్షణ వేసిన 17వ ఓవర్ తొలి బంతికే షిమ్రాన్ హెట్మెయర్ ( 8 ) ను అవుట్ చేశాడు. దీంతో 146 పరుగులకే 4 నాలుగు వికెట్లను రాజస్తాన్ రాయల్స్ కోల్పోయింది. క్రీజులో ధ్రువ్ జురెల్ ( 9 ), దేవదత్ పడిక్కల్ ( 6 ) ఉన్నారు. ప్రస్తుతం రాజస్థాన్ జట్టు స్కోర్ 156/4గా ఉంది.

Show comments