Five Australia Players Wins Three Formats of ICC Titles: లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటిన ఆసీస్ మొదటి డబ్ల్యూటీసీ టైటిల్ ఖాతాలో వేసుకుంది. టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో విజేతగా నిలవడం ద్వారా మూడు ఫార్మాట్ల ఐసీసీ టైటిల్స్ గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డుల్లో నిలిచింది. ఆసీస్ టీమ్ మాత్రమే కాదు.. ఐదుగురు ప్లేయర్స్ కూడా అరుదైన ఘనత సాధించారు. మూడు ఫార్మాట్లలో ఐసీసీ టైటిల్స్ గెలిచారు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లు మూడు ఫార్మాట్లలో ఐసీసీ టైటిల్స్ (ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్) సాధించారు. 2015 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్, 2023 డబ్ల్యూటీసీ టైటిల్స్ గెలిచిన ఆసీస్ జట్టులో ఐదుగురు స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఐదుగరు తప్ప మరెవ్వరూ ఈ ఘనత సాధించలేదు.
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్ మొహ్మద్ సిరాజ్ 4 వికెట్స్ పడగొట్టాడు. ఆపై భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే ఆలౌట్ అయింది. అజింక్య రహానే (89), శార్దూల్ ఠాకూర్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. పాట్ కమిన్స్ 3 వికెట్స్ తీశాడు. అనంతరం ఆసీస్ 270/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అలెక్స్ కారీ (68) అర్ధ శతకం బాదాడు. ఆపై భారత్ 234 పరుగులకు ఆలౌటై దారుణ ఓటమిని మూటగట్టుకుంది.
All-format superstars 🤩
The only five players to have won ICC @cricketworldcup, @T20WorldCup, and World Test Championship titles 🏆✨#WTC23 pic.twitter.com/baeTQNw4KJ
— ICC (@ICC) June 12, 2023