NTV Telugu Site icon

వికెట్ కీపర్‌గా పంత్ మా మొదటి ప్రాధాన్యత : సాహా

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్స్ అలాగే ఇంగ్లండ్ పర్యటనలో పంత్ మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండటానికి అన్నివిధాలుగా అర్హుడని మరో సీనియర్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా పేర్కొన్నాడు. తాజాగా సాహా మాట్లాడుతూ… ‘ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ ఆడాడు. వాటిల్లో పంత్ అద్భుతంగా ఆడాడు. అందుకే ఇంగ్లండ్ పర్యటనలో అతడు మా మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండాలి.నేను తుది జట్టులో స్థానం కోసం వెయిట్ చేస్తా. ఒకవేళ అవకాశం వస్తే నా సామర్ధ్యం మేరకు పరుగులు చేస్తా. ఆ ఒక్క అవకాశం కోసం ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంటా’ అని అన్నాడు. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీసుతో పాటుగా ఐపీఎల్ 2021 లో పంత్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.