Wrestler Bajrang Punia: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) ఎన్నికలు వివాదం కోనసాగుతోంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ కావడంపై రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బ్రిజ్ శరణ్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రెజ్లర్లు ఆందోళన చేపట్టారు.
ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ నిన్న కన్నీటి పర్యంతం అవుతూ.. తాను ఇకపై రెజ్లింగ్‌లో పాల్గొనని గుడ్‌బై చెప్పింది. తాజాగా ఈ గొడవల నేపథ్యంలో తన పద్మశ్రీ అవార్డును ప్రధాని మోడీకి తిరిగి ఇస్తున్నట్లు రెజ్లర్ జబరంగ్ పునియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.
Read Also: JN.1 Corona variant: దేశంలో 21 కొత్త వేరియంట్ కేసులు.. కేసులన్నీ రెండు రాష్ట్రాల్లోనే నమోదు..
నిన్న సంజయ్ సింగ్ గెలుపుపై రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా మాట్లాడారు. సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ గా ఎన్నికయ్యారని, మహిళా రెజ్లర్లు వేధింపులు ఎదుర్కొంటారని, దేశంలో న్యాయాన్ని ఎలా కనుగొనాలో తెలియడం లేదని వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు. మా కెరీర్లు అంధకారంలో ఉన్నాయని, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం దురదృష్టకరమని, మాకు ఏ పార్టీతో సంబంధం లేదని, రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని బజరంగ్ పునియా వ్యాఖ్యానించారు.
