ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రెండు జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి.. ఇక, 20 సంవత్సరాల తర్వాత ఇరు జట్లు ఫైనల్స్‌లో ఒక దానితో ఒకటి తలపడనున్నాయి. అయితే, ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో గెలిచిన జట్టుకు ఐసీసీ 4 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ అందజేస్తుంది. అంటే భారత కరెన్సీలో 33 కోట్ల రూపాయలు అన్నమాట. అయితే, ఓడిన జట్టుకు మాత్రం 2 మిలియన్ డాలర్ల( ఇండియన్ కరెన్సీలో రూ.16.5 కోట్లు) ఇస్తుంది. అంతే కాకుండా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లకు గోల్డెన్ బ్యాట్, ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లకు గోల్డెన్ బాల్ అందజేస్తారు. గోల్డెన్ బ్యాట్ రేసులో విరాట్ కోహ్లీ ముందున్నాడు.
Read Also: Python: హాస్టల్ లో కొండ చిలువ కలకలం.. భయాందోళనలో విద్యార్థులు
అయితే, ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక గోల్డెన్ బ్యాట్‌లను భారత జట్టు కలిగి ఉంది. సచిన్ టెండూల్కర్ రెండుసార్లు గోల్డెన్ బ్యాట్ గెలుచుకోగా.. రోహిత్ శర్మ గత ప్రపంచ కప్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేయడంతో గోల్డెన్ బ్యాట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Read Also: Amitabh Bachchan: ప్లీజ్ అమితాబ్ జీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు రావొద్దు..
ప్రపంచకప్‌లో గోల్డెన్ బ్యాట్ గెలిచిన విజేతల జాబితా ఇదే..
1975 గ్లెన్ టర్నర్, న్యూజిలాండ్
1979 గోర్డాన్ గ్రీనిడ్జ్, వెస్ట్ ఇండీస్
1983 డేవిడ్ గోవర్, ఇంగ్లాండ్
1987 గ్రాహం గూచ్, ఇంగ్లాండ్
1992 మార్టిన్ క్రా, న్యూజిలాండ్
1996 సచిన్ టెండూల్కర్, భారత్
1999 రాహుల్ ద్రవిడ్, భారత్
2003 సచిన్ టెండూల్కర్, భారత్
2007 మాథ్యూ హేడెన్, ఆస్ట్రేలియా
2011 తిలకరత్నే దిల్షాన్, శ్రీలంక
2015 మార్టిన్ గప్టిల్, న్యూజిలాండ్
2019 రోహిత్ శర్మ, భారత్