Site icon NTV Telugu

ఆర్సీబీకి కెప్టెన్ గా డేవిడ్ వార్నర్..? అందుకే ఇది..!

ఆరెంజ్ ఆర్మీ ముద్దుగా వార్నర్ భాయ్ అని పిలుచుకునే సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గత ఐపీఎల్ సీజన్ లో పేలవ ఆటతీరుకు తోడు నాయకత్వ వైఫల్యాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోవడం తెలిసిందే. టోర్నీ మధ్యలో అవమానకర పరిస్థితుల్లో వార్నర్ ను తప్పించారంటూ అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఆర్సీబీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, రానున్న సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు డేవిడ్‌ భాయ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే సన్ రైజర్స్ కి కెప్టెన్ గా ఉన్న సమయంలో డేవిడ్ భాయ్ తెలుగులో టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఎంతో మంది అభిమానులకు దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు ఆర్సీబీ జట్టుకు డేవిడ్ నాయకత్వం వహించనున్నారనే వార్తలకు ఊతం ఇస్తూ.. తాజాగా ఆయన ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున హీరో నటించిన సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కు స్టెప్పులేసి.. అదికూడా కన్నడ వెర్షన్ లోని పాటకు డాన్స్ చేసే వీడియోను పోస్ట్ చేసారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆర్సీబీలో డేవిడ్ వెళ్లనున్నారని ఫిక్స్ అయిపోయారు. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి వైదొలిగిన సంగతి తెలిసిందే.

Exit mobile version