NTV Telugu Site icon

No Third Umpire: థర్డ్ అంపైర్ లేకుండానే టీ20 సిరీస్.. ఇదెక్కడి విడ్డూరం..!

Third Umpire

Third Umpire

No Third Umpire: అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏదైనా మ్యాచ్‌ జరిగితే ఇద్దరూ ఫీల్డ్ అంపైర్‌ల‌తో పాటు ఓ థ‌ర్డ్ అంపైర్ కూడా విధులు నిర్వహిస్తారు. ఈ విష‌యం ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కి తెలుసు.. కానీ ఓ ఇంటర్నేషనల్ సిరీస్ కు థ‌ర్డ్ అంపైర్ లేకుండానే కొనసాగుతుంది. అవును మీరు విన్నదే నిజమేనండి బాబు. ఎడిన్‌బ‌ర్గ్ వేదిక‌గా ఆస్ట్రేలియా- స్కాట్లాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు థ‌ర్డ్ అంపైర్ గా ఎవరు ఉండటం లేదు. థ‌ర్డ్ అంపైర్‌తో పాటు డీఆర్‌ఎస్‌ కూడా అందుబాటులో లేదన్న మాట. థర్డ్ అంపైర్ అం‍దుబాటులో లేకపోవడంతో రనౌట్‌, స్టంపౌట్‌లపై ఫీల్డ్ అంపైర్‌లదే ఇక తుది నిర్ణయం.

Read Also: Dj Tillu : సైలెంట్ గా పని కానిచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ.. మరో బొమ్మరిల్లు..

కాగా, థర్డ్ అంపైర్ లేకపోవడంతో రెండో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు కలిసి వచ్చింది. మెక్‌గర్క్ స్టంపౌట్ ఔటైనప్పటకి ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో మెక్‌గర్క్ ఔటయ్యే ప్రమాదం నుంచి కొద్దీలో తప్పించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియా లాంటి వ‌ర‌ల్డ్‌ క్లాస్ టీమ్ ఆడుతున్న సిరీస్‌కు మూడో అంపైర్ లేక‌పోవ‌డం అంద‌రిని తీవ్ర విస్మయానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఇదే విష‌యం క్రీడా వ‌ర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇక వరుసగా రెండు టీ20ల్లో ఘన విజయం సాధించిన కంగారు జట్టు.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.