ABHISHEK SHARMA: గౌహతిలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. బౌలర్ ఎవరనేది సంబంధం లేకుండా ఉతికి ఆరేశారు. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీనికి తోడు సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్సింగ్ ఆడారు. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేస్తే, భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
Read Also: Abhishek Sharma: గురువుకు తగ్గ శిష్యుడు.. యువరాజ్ సింగ్‌ను గుర్తు చేసిన అభి’సిక్స్’ శర్మ!
అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. మొత్తంగా 20 బంతుల్లోనే 68 పరుగులు చేశారు. తన గురువు యువరాజ్ సింగ్ చేసిన రికార్డ్‌ను తృటిలో కోల్పోయాడు. యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన రికార్డ్ ఉంది. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ పై యువీ ఈ ఫీట్ సాధించారు.
Read Also: IND vs NZ 3rd T20I: వచ్చామా.. కొట్టామా.. గెలిచామా.. టీమిండియా సిరీస్ కైవసం..!
ఇదిలా ఉంటే, మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ బ్యాట్‌ను న్యూజిలాండ్ ప్లేయర్లు చెక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘బ్యాట్‌లో ఏం పెట్టావ్ బ్రో, ఇలా కొడుతున్నావ్’’ అని కివీస్ ప్లేయర్లు చూశారు. దీనిపై ఇంటర్నెట్‌లో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. అభిషేక్ శర్మ 340 స్ట్రైక్ రేట్‌తో 7 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. మొత్తం 68 పరుగుల్లో 58 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే వచ్చాయి. ఈ విధ్వంసంతో అసలు ఇదేం బ్యాట్‌రా బాబూ అంటూ కివీస్ ఆటగాళ్లు ఆసక్తిగా అభిషేక్ బ్యాట్‌ను తనిఖీ చేశారు.
