PAK Vs ZIM: పాకిస్థాన్, జింబాబ్వే మధ్య శత్రుత్వానికి మిస్టర్ బీన్ కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAK Vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో గురువారం సంచలనం నమోదైంది. బలమైన పాకిస్థాన్ జట్టుపై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో జింబాబ్వే అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అటు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో కూడా స్వయంగా ట్వీట్ చేశారు. క్రెగ్ ఇర్విన్ సారథ్యంలోని జింబాబ్వే జట్టును అభినందిస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. ఈ దఫా తమ దేశానికి ఫేక్ మిస్టర్ బీన్‌ను కాకుండా రియల్ మిస్టర్ బీన్‌ను పంపాలంటూ ఎద్దేవా చేశారు. దీంతో పలువురు అభిమానులు మధ్య మిస్టర్ బీన్ సంగతేంటని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈ రెండు దేశాల మధ్య మిస్టర్ బీన్ ఎందుకు వచ్చాడని.. అసలు మిస్టర్ బీన్ కథేంటని క్రికెట్ అభిమానులు తెగ హైరానా పడుతున్నారు.
What a win for Zimbabwe! Congratulations to the Chevrons.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Next time, send the real Mr Bean…#PakvsZim 🇿🇼
— President of Zimbabwe (@edmnangagwa) October 27, 2022
అసలు విషయంలోకి వెళ్తే.. 2016లో జింబాబ్వేలోని హరారె ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఒక కామెడీ షో నిర్వహించారు. ఈ షో కోసం రియల్ మిస్టర్ బీన్ అలియాస్ రొవాన్ అట్కిన్సన్‌ను పంపుతున్నట్లు పాకిస్థాన్ బిల్డప్ ఇచ్చింది. ఒక కారులో మిస్టర్ బీన్ జింబాబ్వేలో రోడ్ షో కూడా నిర్వహించాడు. అప్పటికే బీన్ ప్రపంచ ప్రఖ్యాత కమెడియన్‌గా ఉండటంతో జింబాబ్వే ప్రజలు ఆయనతో ఫొటో దిగేందుకు ఎగబడ్డారు. కానీ తర్వాత అసలు విషయం తెలిసి ఆశ్యర్యపోయారు. ఆయన నిజమైన మిస్టర్ బీన్ కాదు. ఆయన పోలికలతో ఉన్న పాకిస్తాన్ కమెడియన్ ఆసిఫ్ మహ్మద్. అసలైన మిస్టర్ బీన్‌లా బిల్డప్ ఇస్తూ జింబాబ్వే ప్రజలను మోసం చేశాడు. అంతేకాకుండా మిస్టర్ బీన్ తరహాలో కామెడీ షోలో అతనే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అప్పట్లో ఈ విషయం వివాదాస్పదంగా మారింది. తమను నవ్వుల పాలు చేసిన పాకిస్థాన్‌పై జింబాబ్వే రగిలిపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై జింబాబ్వే గెలవడంతో మరోసారి మిస్టర్ బీన్ వివాదం తెరపైకి వచ్చింది.
ఈసారైనా తమ దేశానికి రియల్ మిస్టర్ బీన్‌ను పంపాలని జింబాబ్వే అధ్యక్షుడు చేసిన ట్వీట్ పట్ల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా స్పందించారు. తమ దగ్గర రియల్ మిస్టర్ బీన్ లేడని.. కానీ.. తమ వద్ద అసలైన క్రికెట్ స్ఫూర్తి ఉందని.. అలాగే తమ పాకిస్థానీలకు బౌన్స్ బ్యాక్ అయ్యే ఫన్నీ అలవాటు ఉందన్నారు. మిస్టర్ ప్రెసిడెంట్ శుభాకాంక్షలు.. మీ జట్టు అద్భుతంగా ఆడిందంటూ షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు.
We may not have the real Mr Bean, but we have real cricketing spirit .. and we Pakistanis have a funny habit of bouncing back 🙂
Mr President: Congratulations. Your team played really well today. 👏 https://t.co/oKhzEvU972
— Shehbaz Sharif (@CMShehbaz) October 27, 2022
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!