India Vs West Indies First Odi వెస్టిండీస్ పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఈరోజు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో జట్టును శిఖర్ ధావన్ నడిపించనున్నాడు. తన కెరీర్‌లో రెండోసారి టీమిండియాకు ధావన్ నాయకత్వం వహిస్తున్నాడు. గత ఏడాది శ్రీలంక పర్యటనలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు ఇప్పుడు మరోసారి ఆ బాధ్యతలను చేపట్టాడు. ఈ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా అతడు తొలి రెండు వన్డేలకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ తెలిపింది.
కాగా ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. 30 శాతం వర్షం పడే అవకాశం ఉందని కామెంటేటర్లు వివరించారు. తొలుత ఈ వికెట్ బౌలర్లకు అనుకూలిస్తుందని.. నిలదొక్కుకుంటే భారీగా పరుగులు చేయవచ్చని పిచ్ రిపోర్ట్ ద్వారా తెలియజేశారు. అటు ఈ సిరీస్‌లో ధావన్ మరో 111 పరుగులు సాధిస్తే విండీస్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ (790) తర్వాత రెండో స్థానంలో నిలుస్తాడు. ప్రస్తుతం ధోనీ 458, యువరాజ్ 419, రోహిత్ 408 పరుగులతో ఉండగా.. ధావన్ (348) పరుగులతో ఉన్నాడు.
తుది జట్లు:
భారత జట్టు: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, చాహల్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్, హోప్, బ్రూక్స్, హోసెన్, జోసెఫ్, బ్రెండన్ కింగ్, మైయర్స్, మోటీ, పావెల్, సీల్స్, షెపర్డ్