Site icon NTV Telugu

కోహ్లీ, విలియమ్సన్‌ మధ్య పోటీ ఏమాత్రం ఉండదు…

భారత మాజీ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌స్ గురించి మాట్లాడుతూ… కోహ్లీ, విలియమ్సన్‌ గొప్ప క్రికెటర్లని ప్రశంసించారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న కోహ్లీసేన జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. తాజాగా ఈ మ్యాచ్ గురించి వీవీఎస్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ… టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో విరాట్‌ కోహ్లీ, కేన్ విలియమ్సన్‌ మధ్య పోటీ ఉండదు. వారిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటారు. కోహ్లీ, విలియమ్సన్‌ ఇద్దరూ ప్రపంచ వ్యాప్తంగా యువతకు ఆకర్షించారు. వారు తమతమ జట్లను అద్భుతంగా నడిపిస్తున్నారు అని అన్నారు.

Exit mobile version