NTV Telugu Site icon

Cricket: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

Vvs Laxman

Vvs Laxman

ఐపీఎల్ తర్వాత వరుస సిరీస్‌లతో టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. తొలుత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టు తలపడనుంది. జూన్ 9 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఎందుకంటే జూన్ తొలివారంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉంది. ఈ కారణంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉండనున్నారు. అంతేకాకుండా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే జట్టుతోనే ఉండనున్నాడు.

IPL 2022: స్వదేశానికి వెళ్తున్న కేన్ మామ.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు దూరం

ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను ఉండాలని బీసీసీఐ కోరింది. ఇందుకు లక్ష్మణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో పలు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, మోషీన్ ఖాన్ వంటి యంగ్ ప్లేయర్లకు జట్టులో స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. కాగా గతంలో కూడా టీమిండియా ఇంగ్లండ్, శ్రీలంక పర్యటించాల్సిన సమయంలో రెండు జట్లుగా టీమిండియా విడిపోగా రెగ్యులర్ జట్టుకు రవిశాస్త్రి, శ్రీలంకలో యువ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.