NTV Telugu Site icon

Virat Kohli: నాటు నాటు స్టెప్ వేసిన విరాట్.. నువ్వు కూడా హీరో అయిపో అన్నా

Virat

Virat

Virat Kohli: నాటు నాటు సాంగ్.. ఆస్కార్ అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఇండియాలో ఎక్కడ చూసినా ఈ సాంగ్ నే వినిపిస్తోంది. పండుగ అయినా ఫంక్షన్ అయినా ఈవెంట్ అయినా సంతోషంలో ఉన్నా ప్రతి భారతీయుడు నాటు నాటు సాంగ్ కు స్టెప్స్ వేస్తున్నాడు అంటే అతిశయోక్తి కాదు. సామాన్యులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు సైతం ఈ సాంగ్ కు స్టెప్స్ వేస్తూ అభిమానులను కనువిందు చేస్తున్నారు. ఇక తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం గ్రౌండ్ లో నాటు నాటు సాంగ్ కు స్టెప్స్ వేసి అదరగొట్టేశాడు. నేటి నుంచి వన్డే సిరీస్ మొదలయ్యిన విషయం తెల్సిందే. వాంఖడే స్టేడియంలో మొదటి రోజు ఇండియ, ఆస్ట్రేలియాతో తలపడుతుంది. హోరాహోరీగా సాగుతున్న ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ పూర్తి చేశాక విరాట్ గ్రౌండ్ లో నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ వేయడం సెన్సేషన్ గా మారింది. వెనుక నుంచి విరాట్ స్టెప్స్ వేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Nani: నాని ఒక్కడే బ్యాటింగ్ చేస్తున్నాడు.. ఎందుకు..?

ఇక ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ సైతం షేర్ చేస్తూ.. విరాట్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. పర్ఫెక్ట్ గా నాటు నాటు స్టెప్స్ వేస్తున్న విరాట్ ను చూసి అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఈ వీడియోపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అన్నా.. నువ్వు కూడా హీరోలా ట్రై చెయ్.. అని కొందరు. సూపర్ సూపర్ అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు విరాట్ ఏమైనా సినిమాల్లో నటించే అవకాశం ఉందేమో చూడాలి.

Show comments