Site icon NTV Telugu

Virat Kohli: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ‘కింగ్’ కోహ్లీ.. ఫొటోలు వైరల్!

Virat Kohli Simhachalam Temple

Virat Kohli Simhachalam Temple

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంను టీమిండియా స్టార్ క్రికెటర్‌, రికార్డుల రారాజు ‘విరాట్‌ కోహ్లీ’ దర్శించుకున్నాడు. ఈరోజు ఉదయం సింహాద్రి అప్పన్నను కింగ్ దర్శించుకున్నారు. దర్శనానంతరం కోహ్లీకి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అప్పన్న స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు ఆలయ అధికారులు కోహ్లీకి స్వాగతం పలికారు.

Also Read: Alluri Agency Shock: అల్లూరి ఏజెన్సీలో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి!

విరాట్‌ కోహ్లీ రాకతో సింహాద్రి అప్పన్న ఆలయంలో సందడి నెలకొంది. భక్తులు తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఆలయంలో కొందరికితో విరాట్ ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోహ్లీకి దైవ భక్తి ఎక్కువే అన్న విషయం తెలిసిందే. ఏ ప్రాంతానికి వెళ్లినా.. సమయం ఉన్నపుడు అక్కడి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తుంటాడు. ఇక విశాఖ వన్డేలో కోహ్లీ చెలరేగిన విషయం తెలిసిందే. 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 65 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీతో 302 పరుగులు చేసిన కోహ్లీ.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా నిలిచాడు.

Exit mobile version