వన్డే క్రికెట్‌లో భారీ లక్ష్యాల్ని ఛేదించడంలో ‘కింగ్’ విరాట్ కోహ్లీకి ఎవరూ సాటిలేరని గణాంకాలు చెబుతున్నాయి. భారత్ 300 రన్స్ పైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన మ్యాచ్‌ల్లో కోహ్లీ చూపించిన స్థిరత్వం, క్లాస్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. 300+ రన్స్ లక్ష్యం ఉన్న విజయవంతమైన చేజ్‌లలో కోహ్లీ ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ 12 ఇన్నింగ్స్‌ల్లో 1091 పరుగులు చేశాడు. కేవలం పరుగులే కాదు.. సగటు కూడా అద్భుతంగా ఉంది. ఛేజింగ్ మ్యాచ్‌ల్లో కోహ్లీ సగటు 121.22గా ఉండటం విశేషం.
Also Read: Anil Ravipudi: వరసగా తొమ్మిదో విజయం.. ‘సంక్రాంతి’ మొనగాడు అనిల్ రావిపూడి!
స్ట్రైక్‌రేట్ విషయంలోనూ విరాట్ కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 871 బంతుల్లో 1091 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ 125.25గా ఉంది. భారీ లక్ష్యాల చేజ్‌లోనూ స్ట్రైక్‌రేట్, సగటు రెండింటినీ మైంటైన్ చేశాడు. శతకాలు, అర్ధశతకాల గణాంకాలు కోహ్లీ ప్రతిభను స్పష్టంగా చూపిస్తున్నాయి. 12 ఇన్నింగ్స్‌ల్లోనే 7 శతకాలు, 2 అర్ధశతకాలు సాధించడం విశేషం. కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడిన మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. ప్రెజర్ పరిస్థితుల్లో బాధ్యత తీసుకుని జట్టును గెలిపించడంలో కోహ్లీ మేటి అని ఈ గణాంకాలు చెబుతున్నాయి. 300కు పైగా లక్ష్యాలైనా సరే.. కోహ్లీ క్రీజులో ఉంటే భారత అభిమానులకు విజయంపై నమ్మకం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
