పాకిస్థాన్‌తో మ్యాచ్ ఓడిపోవడంతో టీమిండియా దృష్టి తరువాతి మ్యాచ్‌పై పడింది. ఈనెల 31న ఆదివారం భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ సరికొత్త యాడ్ రూపొందించింది. ఈ ప్రకటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను టీజింగ్ చేశాడు. కోహ్లీకి పంత్ ఫోన్ చేసి.. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే తనకు కొత్త ఆలోచన వచ్చిందని చెప్తాడు. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వికెట్ పడిన ప్రతీసారి తాను గ్లోవ్స్ మార్చుకుంటానని, దీనికి అనుమతి ఇవ్వాలని పంత్ కోహ్లీని కోరతాడు.
Read Also: న్యూజిలాండ్ జట్టుకు షాక్ మీద షాక్
అయితే పంత్‌కు కోహ్లీ అదిరిపోయేలా కౌంటర్ ఇస్తాడు. సిక్సర్ కొట్టిన ప్రతీసారి బ్యాట్ మారుస్తారా అంటూ పంచ్ వేశాడు. గెలవాలంటే ఏదో ఒకటి మార్చాలి కదా అని పంత్ అడిగేసరికి.. ‘సరే ఒక పని చేస్తా.. ఆటలో నువ్వు ఫోకస్‌గా ఉండటం లేదు.. కాబట్టి జట్టు నుంచి నిన్నే తీసేద్దామనుకుంటున్నా’ అంటూ కోహ్లీ సెటైర్ వేస్తాడు. ఇవన్నీ వదిలేసి ఇప్పటికైనా మ్యాచ్‌పైన దృష్టి పెట్టు అని కోహ్లీ హితవు పలుకుతాడు. కాగా ఈ కొత్త ప్రకటన క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇతర సమీకరణాలను వదిలేసి భారత్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. మరి మనోళ్లు ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.
