Site icon NTV Telugu

Virat Kohli: మద్దతు తెలిపిన బాబర్‌కి ఏం రిప్లై ఇచ్చాడో తెలుసా..?

Virat Kohli Reply To Babar

Virat Kohli Reply To Babar

Virat Kohli Reply To Babar Azam Tweet: చాలాకాలం నుంచి ఫామ్‌లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే! ముఖ్యంగా.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో మరోసారి నిరాశపరచడంతో, అభిమానులు సమా మాజీలు కోహ్లీని టార్గెట్ చేశారు. ఇక అతని పని అయిపోయిందని, జట్టులో నుంచి తీసేయాల్సిందేనని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే అతనికి కొందరు మద్దతుగా నిలిచారు.

అందరికంటే ముందు పాకిస్తాన్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్ అతనికి అండగా నిలిచాడు. ‘ఫామ్ కష్టాలు సమసిపోతాయి, ధైర్యంగా ఉండు’ అని ట్వీట్ చేసిన అతను, కోహ్లీతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ అతనిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు బాబర్ చేసిన ఆ ట్వీట్‌కి తాజాగా విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘‘థ్యాంక్యూ.. నువ్వు ఇలాగే రాణిస్తూ, ఎదుగుతూ ఉండాలి, ఆల్‌ ద బెస్ట్‌ బాబర్‌’’ అంటూ బదులిచ్చాడు. బాబర్ చేసిన ట్వీట్‌పై కోహ్లీ రియాక్ట్ అవ్వాల్సిందని షాహిద్ ఆఫ్రిది ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే కోహ్లీ రిప్లై ఇచ్చాడు.

కాగా.. కెరీర్ ఆరంభం నుంచి కోహ్లీని గురువుగా భావిస్తూ వస్తున్నాడు బాబర్ ఆజమ్. తన రోల్ మోడల్ కోహ్లీని అని చాలాసార్లు ప్రకటించిన అతడు, ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించినా కోహ్లీనే కోహ్లినే తన ఆరాధ్య క్రికెటర్‌గా పేర్కొంటాడు. అయితే.. ఇటీవల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోహ్లీని అవమానించేలా బాబర్ ప్రవర్తించాడు. కోహ్లీ రికార్డ్‌ని బద్దలు కొట్టారని చెప్పబోతుండగానే.. ‘ఏ రికార్డు’ అంటూ పేర్కొన్నాడు. అయితే, కష్టకాలంలో ఉన్న కోహ్లీకి అండగా నిలిచి, స్పోర్ట్స్‌మ్యాన్షిప్‌ని చాటిచెప్పాడు.

Exit mobile version