Site icon NTV Telugu

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విరాట్ కోహ్లీ…

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విరాట్ వీలైనంత త్వరగా ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపాడు. అయితే కట్టు దిట్టమైన బయో బాబుల్ జరుగుతున్న ఐపీఎల్ 2021 లోకి కరోనా రావడంతో నిరవధికంగా టోర్నీ వాయిదా పడింది. ఈ క్రమంలోనే బీసీసీఐ సూచన మేరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు విరాట్ కోహ్లీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత ఆటగాళ్లంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని బీసీసీఐ ఇంతకముందే సలహా ఇచ్చిన విషయం తెలిసిందే.

Exit mobile version