Site icon NTV Telugu

Virat Kohli Net Worth: సంపాదనలోనూ ‘కింగే’.. విరాట్‌ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Virat Kohli

Virat Kohli

Cricketer Virat Kohli Net Worth Crosses 1000 Crore: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన బ్యాటింగ్‌తో భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం కోహ్లీకి క్రేజ్ మాములుగా లేదు. సోషల్ మీడియా ఖాతాలలో అతడికి ఉన్న ఫాలోవర్ల సంఖ్యను చూస్తేనే ఇది స్పష్టం అవుతుంది. ప్రపంచంలో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్ కోహ్లీ మాత్రమే. అంతేకాదు ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న క్రీడాకారులలో మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కేవలం మైదానంలో మాత్రమే కింగ్ కాదు.. సంపాదనలోనూ కింగే.

ఒక్క ఇన్‌స్టాలోనే విరాట్ కోహ్లీకి 252 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. భారత మాజీ కెప్టెన్ ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు దాదాపు 9 కోట్లు వసూలు చేస్తాడని సమాచారం. ఇక బీసీసీఐ, యాడ్స్, ఐపీఎల్, వ్యాపారాల ద్వారా వందల కోట్లు సంపాదిస్తాడు. కోహ్లీ సంపాదనకు సంబందించిన వివరాలను స్టాక్‌ గ్రో (Stock Gro) కంపెనీ తన కవర్ పేజీ మీద ప్రచురించింది. ఈ మ్యాగ్‌జైన్ లెక్కల ప్రకారం… కోహ్లీ నికర ఆదాయం (నెట్‌వర్త్) రూ.1050 కోట్లుగా ఉంది. దీంతో ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు.

Also Read: Green Brinjal Benefits: ఈరోజు నుంచే గ్రీన్ వంకాయలను తినడం మొదలెట్టండి.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!

విరాట్ కోహ్లీకి భారత్ ‘A+’ కాంట్రాక్ట్‌ ఉన్న విషయం తెలిసిందే. దాంతో బీసీసీఐ నుంచి రూ. 7 కోట్లు లభిస్తాయి. ప్రతి టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు వస్తాయి. ఇక ఐపీఎల్‌ ద్వారా ఏడాదికి రూ.15 కోట్లు సంపాదిస్తాడు. కోహ్లీకి సొంతంగా చాలా బ్రాండ్లు ఉన్నాయి. బ్లూట్రైబ్‌, యూనివర్సల్‌ స్పోర్ట్స్‌బిజ్‌, ఎంపీఎల్‌, స్పోర్ట్స్‌ కాన్వో లాంటి స్టార్టప్స్‌లో అతడు పెట్టుబడి పెట్టాడు. వీటి ద్వారా కూడా కోట్లు ఆర్జిస్తాడు.

విరాట్‌ కోహ్లీ దాదాపు 18 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఒక్కో యాడ్‌కు రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్లు తీసుకుంటాడు. యాడ్స్ ద్వారానే రూ.175 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు రూ.9 కోట్లు ఛార్జ్‌ చేస్తుండగా.. ట్విటర్‌లో ఒక్కో పోస్టుకు రూ.2.5 కోట్లు తీసుకుంటాడు. ఇక అతడికి రూ.34 కోట్ల విలువ చేసే ఇల్లు ముంబైలో ఉంది. రూ.80 కోట్ల విలువ చేసే మరో ఇల్లు గురుగ్రామ్‌లో ఉంది. రూ.31 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. అంతేకాకుండా ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్‌ క్లబ్‌, ఓ టెన్నిస్‌ జట్టు, ప్రో రెజ్లింగ్‌ జట్టు కూడా కోహ్లీకి ఉన్నాయి. మరోవాపు ఫౌండేషన్ పేరిట పేద విద్యార్థులు, క్రికెటర్లకు స్కాలర్‌షిప్ అందజేస్తున్నాడు.

Also Read: Litchi Side Effects: లీచీ పండ్లను ఎక్కువగా తింటున్నారా?.. జాగ్రత్తగా ఉండాల్సిందే! ప్రాణాలు పోతాయ్

Exit mobile version