Virat Kohli: కింగ్ ఈజ్ బ్యాక్.. కోహ్లీ రికార్డుల మోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్‌లో గురువారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీలో ఫైర్ కనిపించింది. ముఖ్యంగా అభిమానులకు పాత కోహ్లీని గుర్తుకుతెచ్చాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 73 పరుగులు చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. విరాట్ బ్యాట్ నుంచి పరుగులు వెల్లువెత్తడంతో అతడి పేరిట రికార్డుల మోత కూడా మోగింది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోహ్లీ 14 మ్యాచ్‌లు ఆడి 309 పరుగులు చేశాడు. దీంతో 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ప్రతి సీజన్‌లో వరుసగా 300కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. గతంలో సురేష్ రైనా, శిఖర్ ధావన్ 12 సార్లు ఈ ఘనతను సాధించారు. వీళ్లిద్దరూ ఐపీఎల్‌లో 12 సార్లు 300కు పైగా పరుగులు పూర్తి చేశారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు కోహ్లీ 23 సార్లు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 150 పరుగులకు పైగా భాగస్వామ్యం 6 సార్లు, 200 పరుగుల భాగస్వామ్యాలను మూడు సార్లు నమోదు చేశాడు.
Also Read
- Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ 'ఏ' జట్టులోకి ఎంట్రీ..
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
అటు ఐపీఎల్‌లో ఒక జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2008 నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్న కోహ్లీ అప్పటి నుంచి ఇదే జట్టుకు ఆడుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు అతడు 7వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 424 పరుగులు ఛాంపియన్స్ లీగ్‌లో సాధించగా.. మిగతా పరుగులు ఐపీఎల్‌లోనే చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీ 7వేల పరుగులు పూర్తి చేసిన ఘనత సాధించాడు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!