Virat Kohli Creates Sensational Records With His 166 Innings Against Sri Lanka: తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్స్ మైదానం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఎలా విజృంభించాడో అందరూ చూశారు. తొలుత నిదానంగా తన ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీ.. సెంచరీ చేశాక ఒక్కసారిగా చెలరేగిపోయాడు. ఎడాపెడా షాట్లతో బౌండరీలు బాదుతూ పరుగుల వర్షం కురిపించాడు. దీంతో.. 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 8 సిక్స్‌లో సహాయంతో 166 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడు కొన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ శతకంతో అతడు స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు 20 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ పేరిట ఆ రికార్డ్ ఉండేది. ఇప్పుడు కోహ్లీ 21 సెంచరీలతో ఆ రికార్డ్‌ని బద్దలుకొట్టాడు.
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు విశాఖలో అపూర్వ స్వాగతం.. మంగళ వాయిద్యాలు, పూల వర్షం
శ్రీలంకపై కోహ్లీకి ఇది 10వ వన్డే సెంచరీ కావడంతో.. ఆ జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సచిన్ టెండ్కూలర్ (9) పేరిట ఉండగా.. తాజా సెంచరీతో కోహ్లీ దాన్ని బ్రేక్ చేశాడు. అదేవిధంగా స్వదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో 6976 పరుగులతో సచిన్ మొదటి స్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్ 5521 పరుగులతో రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ 5303 రన్స్‌తో మూడో స్థానంలో నిలిచారు. ఇక అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి చరిత్రపుటలకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 12754 పరుగులు చేశాడు. ఈ దెబ్బకు శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650) రికార్డ్ బద్దలైంది. ఈ జాబితాలో సచిన్ (18426) అగ్రస్థానంలో ఉంటే, రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర 14234 పరుగులతో ఉన్నాడు.
RRR: ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అవార్డ్.. తొలి భారతీయ సినిమాగా..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (116), విరాట్ కోహ్లీ (166 నాటౌట్) శతకాలతో చెలరేగడం వల్లే భారత్ అంత భారీ స్కోర్ చేయగలిగింది. ఇక 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 73 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. 317 పరుగుల తేడాతో భారత్ రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది. దీంతో.. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇంతకుముందు కివీస్ 290 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధిస్తే.. ఆ రికార్డ్‌ని భారత్ ఇప్పుడు బద్దలుకొట్టింది.
