ప్రస్తుతం ఐపీఎల్ 2023 ఎడిషన్ 16లో ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గెలిచేందుకు ఆర్సీబీ ప్లేయర్స్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ భారమంతా కే.జీ.ఎఫ్. (కోహ్లి, గ్లెన్, ఫాఫ్ డుప్లెసిస్)పై ఉన్న నేపథ్యంలో వీరు ప్రాక్టీసు చేస్తున్న వీడియోను ఆర్సీబీ ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఆరు మ్యాచ్ ల్లో గెలిచి.. 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది.
Also Read : Free Flight Tickets : రూపాయి ఖర్చు లేకుండా విమానంలో ప్రయాణించవచ్చు.. మీకు తెలుసా..!
చెన్నై, లక్నో, ముంబై, ఆర్సీబీ మధ్య మిగతా మూడు బెర్తుల కోసం హోరాహోరీగా పోటీ నెలకొంది. రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న రాజస్తాన్ సైతం ప్లే ఆఫ్స్ పై ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో ఇవాళ (గురువారం) సన్‌రైజర్స్-ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఫలితం కీలకంగా మారింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ను ఈ మ్యాచ్‌లో ఓడిస్తేనే ఆర్సీబీ రేసులో ఉంటుంది. లేదంటే ఆశలు వదులుకోవాల్సిందే!. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్లపైనే అందరి దృష్టి పడింది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read : Exoplanet: వామ్మో… ఆ గ్రహం నిండా అగ్నిపర్వతాలే.. 90 కాంతి సంవత్సరాల దూరంలో హెల్ ప్లానెట్
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి.. మాక్సీవెల్, ఫాఫ్ డుప్లెసిస్ కు బౌలింగ్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త.. నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సీజన్‌లో డుప్లెసిస్ ఇప్పటి వరకు 631 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లి 438, మాక్సీవెల్ 384 రన్స్ చేశారు.