NTV Telugu Site icon

Kohli – Ashwin: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. కోహ్లీ – అశ్విన్ ఖాతాల్లో రికార్డులు

Kohli Ashwin

Kohli Ashwin

Virat Kohli And Ashwin Creates New Records In 4th Test With Australia: అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్.. డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే! ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. సుమారు మూడున్నరేళ్ల నిరీక్షణ తర్వాత ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లీ.. దాదాపు డబుల్ సెంచరీ అంచులదాకా వెళ్లాడు. ఫలితంగా.. అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యా్ అవార్డ్ దక్కింది. ఇక అశ్విన్ అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో ఆసీస్ తాండవం చేశాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం సిరీస్ పరంగా చూసుకుంటే.. బౌలర్లలో అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా అదరగొట్టాడు. దీంతో.. వీళ్లిద్దరు కలిసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ పంచుకున్నారు.

Rapper Costa Titch: పాట పాడుతూ.. వేదికపైనే కుప్పకూలిన ర్యాపర్

ఇలా వేర్వేరు విభాగాల్లో వేర్వేరు అవార్డులు అందుకోవడంతో.. అశ్విన్, విరాట్ కోహ్లీల ఖాతాల్లోకి సరికొత్త రికార్డులు వచ్చిపడ్డాయి. తొలుత కోహ్లీ గురించి మాట్లాడుకుంటే.. తాజా అవార్డ్‌తో కలిపి టెస్టుల్లో మొత్తం 10 మ్యాన్ ఆఫ్ ద మ్యాన్ అవార్డులు అందుకున్న అతడు, లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేతో (10) సమంగా నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 14 అవార్డులతో అగ్రస్థానంలో ఉండగా, రాహుల్ ద్రవిడ్ 11 అవార్డ్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ విషయానికొస్తే.. టెస్టుల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో కల్లిస్‌ను (9) వెనక్కునెట్టి, అతడు (9) రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో లంక దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌ 11 అవార్డులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అశ్విన్ ఇదే జోరు కొనసాగిస్తే.. మురళీథరన్ త్వరలోనే బద్దలయ్యే అవకాశం ఉంది.

3 Year Old Shoots Sister: బొమ్మ తుపాకీ అనుకొని.. అక్కనే కాల్చి చంపిన చిన్నారి

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన ఎంపిక చేసుకున్న ఆస్ట్రేలియా, తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఉస్మాన్‌ ఖ్వాజా (180), గ్రీన్‌ (114) అద్భుత సెంచరీలు చేయడంతో.. ఆస్ట్రేలియా అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శుభ్‌మన్‌ గిల్‌ (128), విరాట్‌ కోహ్లి (186) శతకాలతో అలరించగా.. అక్షర్ పటేల్ (79) కూడా మెరుగ్గా రాణించాడు. ఇరు జట్లు డ్రాకు అంగీకరించే సమయానికి.. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. నాలుగో టెస్ట్‌ డ్రాగా ముగియడంతో.. నాలుగు మ్యాచ్‌ల బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023ని భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

Show comments