ఐపీఎల్‌లో సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్ అరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే కోల్‌కతా ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో రెండు బౌండరీలు కొట్టి ఊపు మీద ఉన్న ఫించ్‌ను రాజస్థాన్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ అవుట్ చేశాడు. దాంతో సహనం కోల్పోయిన ఫించ్ ప్రసిధ్ కృష్ణపై నోరు పారేసుకున్నాడు. పెవిలియన్‌కు వెళ్తూ సూటిపోటి మాటలతో కవ్వించాడు.
ఈ నేపథ్యంలో ప్రసిధ్ కృష్ణ కూడా నోరు కట్టేసుకుని కూర్చోలేదు. తనదైన శైలిలో అరోన్ ఫించ్‌కు కౌంటర్ ఇచ్చాడు. వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణలపై క్లారిటీ లేదు కానీ ప్రసిధ్ కృష్ణ అయితే మూసుకుని పోరా అంటూ ఫించ్‌ను అన్నట్లు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే భారీ స్కోరును సాధించే క్రమంలో ఈ మ్యాచ్‌లో కోల్‌కతా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
https://twitter.com/Raj93465898/status/1516102784575188996
