NTV Telugu Site icon

Dhawan: కుర్రాళ్ల దెబ్బ.. ధావన్ ప్లేస్ గల్లంతు!

Dhawan1

Dhawan1

ప్రస్తుతం టీమిండియా మంచి జోరు మీదుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వరుస సిరీస్‌లు గెలుస్తూ దూసుకెళ్తోంది. అలాగే జట్టులోకి కొత్తగా వచ్చిన ప్లేయర్లు సూపర్ ఫామ్ చూపిస్తుండటం భారత్‌కు మరింత బలంగా మారింది. ఇందులో రోహిత్‌కు జోడీగా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అతను లేకపోతే ఓపెనింగ్ చేయడం కోసం ఇషాన్ కిషన్ రెడీగా ఉన్నాడు. గిల్ తన చివరి ఆరు వన్డేల్లో మూడు సెంచరీలు చేశాడు. వీటిలో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండటం గమనార్హం. అలాగే ఇషాన్ కిషన్ కూడా బంగ్లాదేశ్‌పై భారీ డబుల్ సెంచరీ బాదాడు. ఇలాంటి క్రమంలో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ దాదాపు ముగిసినట్లే అనిపిస్తోంది.

Sania Mirza: కెరీర్‌ చివరి టోర్నీలో ఫైనల్‌కు సానియా..టైటిల్‌ దక్కుతుందా!

కాగా, గత మూడేళ్లలో ధావన్ ఒక్క అంతర్జాతీయ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 2020-2021 సీజన్‌లో మాత్రం అదరగొట్టాడు. సుమారు 50 సగటుతో పరుగులు చేశాడు. కానీ 2021-2022 సీజన్‌లో ధావన్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. గతేడాది టీ20 వరల్డ్ కప్ ఉండటంతో రోహిత్, విరాట్ వంటి సీనియర్లు వన్డే ఫార్మాట్లో ఆడలేదు. ఈ క్రమంలో ఆ జట్టుకు ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాది చాలా టోర్నీల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్.. 22 మ్యాచ్‌ల్లో కేవలం 34 సగటు, 74 స్ట్రైక్ రేటుతో 688 పరుగులు మాత్రమే చేశాడు.

MS Dhoni: ‘షోలే 2’లో ధోనీ, హార్దిక్!..వైరల్ అవుతోన్న ఫోటో

అదే సమయంలో అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న యంగ్ ప్లేయర్ గిల్ తన ఆటతీరును చాలా మెరుగు పరుచుకున్నాడు. అద్భుతమైన వన్డే బ్యాటర్‌గా పరిణితి చెందాడు. వరుస సెంచరీలతో దూసుకెళ్తు్న్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మొత్తం 360 రన్స్ చేసి మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్‌గానూ నిలిచాడు. ఇకపోతే, కిషన్ కూడా ఓపెనర్‌గా సత్తా చాటుతున్నాడు. అవకాశం వస్తే చాలు దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. దీంతో ఇక మళ్లీ ధావన్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వెటరన్ బ్యాటర్ మళ్లీ ఫామ్ అందుకున్నా.. గిల్, కిషన్ ఫామ్‌లో ఉన్నంత కాలం ధావన్‌కు అవకాశం రావడం అసాధ్యం అని చెబుతున్నారు.