Site icon NTV Telugu

Venkatesh Iyer: మైదానంలోనే కుప్పకూలిన టీమిండియా యువ క్రికెటర్.. ఏం జరిగిందంటే..?

Venkatesh Iyer

Venkatesh Iyer

Venkatesh Iyer: దులీప్ ట్రోఫీలో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూరులో వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ జట్ల మధ్య సెమీఫైనల్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెస్ట్ జోన్ బౌలర్ చింతన్ గజా విసిరిన బంతి వెంకటేశ్ అయ్యర్ మెడపై బలంగా తాకింది. గాయంతో విలవిల్లాడుతూ వెంకటేశ్ అయ్యర్ మైదానంలోనే కుప్పకూలాడు. వెంటనే అంబులెన్స్ వచ్చి అయ్యర్‌ను మైదానం నుంచి తీసుకెళ్లింది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే.. అయ్యర్ కోలుకున్నాడు. సెంట్రల్ జోన్ జట్టు ఏడో వికెట్ కోల్పోయిన తర్వాత బ్యాటింగ్‌ వచ్చాడు.

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బౌలర్లలో కుమార్ కార్తీకేయ 5 వికెట్లు తీశాడు. అనంతరం వెస్ట్ జోన్ బౌలర్లు విజృంభించడంతో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే ఆలౌటైంది. జైదేవ్ ఉనద్కట్, తనూష్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అతిత్ సేత్ 2 వికెట్లు, చింతన్ గజా, షామ్స్ ములానీ తలో వికెట్ సాధించారు. వెస్ట్ జోన్ జట్టుకు టీమిండియా టెస్ట్ క్రికెటర్ ఆజ్యింకా రహానె కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. సెంట్రల్ జోన్ జట్టుకు కరణ్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

Exit mobile version