Vaibhav Suryavanshi: ‘నేనే ఇండియా కోచ్ అయితే వైభవ్‌ని పీకి పక్కన పెట్టేవాడిని..’టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi : ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే పేరు..అదే వైభవ్ సూర్యవంశీ. చిన్న వయసులోనే భారీ షాట్లు, భయమే తెలియని బ్యాటింగ్‌తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ యువ ఆటగాడు ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి చర్చ అతని బ్యాట్ గురించి కాదు. మైదానంలో జరిగిన ఘర్షణ గురించి.
శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్‌లో భారత్ ఏ, శ్రీలంక ఏ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు సమాన స్కోర్లు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. చివరకు శ్రీలంక ఏ విజయం సాధించింది. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఘటనే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మైదానం వీడి వెళ్తున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. మాటల యుద్ధం క్రమంగా ఉద్రిక్తంగా మారి తోపులాట వరకు వెళ్లింది. ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొన్ని రిపోర్టుల ప్రకారం శ్రీలంక ఆటగాళ్ల వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయని చెబుతున్నారు.
Also Read
- U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
- Manal Chauhan: లెక్కలేసుకుని ఆడాను.. కానీ భారత్‌ను గెలిపించలేకపోయా.. మనాల్ ఎమోషనల్ కామెంట్స్!
- Aaryavir Sehwag: పాక్‌పై గెలుపు వెనుక అసలు ప్లాన్ ఇదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఆర్యవీర్ సెహ్వాగ్!
- IND vs NZ ODI: ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత్ తుది జట్టులో ఊహించని మార్పులు.. కొత్త కుర్రాడి ఎంట్రీ..
ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించిన తీరు ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది. తాను ఇండియా ఏ కోచ్‌గా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ ఏతో జరిగిన తర్వాతి మ్యాచ్‌కు వైభవ్‌ను జట్టులోకి తీసుకునేవాడిని కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యర్థి ఎంతగా రెచ్చగొట్టినా మైదానంలో శారీరకంగా స్పందించడం సరైన పద్ధతి కాదని చెప్పారు. ఆటగాడికి క్రమశిక్షణ ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా ఒక మ్యాచ్ పక్కన పెట్టడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
మంజ్రేకర్ వ్యాఖ్యలు ఎందుకు అంత ప్రాధాన్యం సంతరించుకున్నాయంటే… కొన్ని రోజుల క్రితమే ఇదే వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై ప్రశంసలు కురిపించిన వారిలో ఆయనే ఒకరు. ఈ యువ ఆటగాడిలో కేవలం టీ20 స్టార్ మాత్రమే కాదు, భవిష్యత్తులో వన్డే క్రికెట్‌ను శాసించే సామర్థ్యం కూడా ఉందని చెప్పారు. అలాంటి ఆటగాడి విషయంలోనే ఇప్పుడు క్రమశిక్షణపై గట్టిగా మాట్లాడాడు.
మరోవైపు భారత జట్టు కోచ్ సైరాజ్ బహుతులే మాత్రం వైభవ్‌కు మద్దతుగా నిలిచారు. సాధారణంగా అతడు చాలా ప్రశాంతంగా ఉండే ఆటగాడని, అసలు ఎలా రెచ్చగొట్టారో తనకు తెలియదని చెప్పారు. జరిగిన ఘటన నుంచి వైభవ్ పాఠాలు నేర్చుకుంటాడనే నమ్మకం వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడు వైభవ్ ముందు ఉన్న అసలు సవాల్ పరుగులు చేయడం మాత్రమే కాదు. తన భావోద్వేగాలను కూడా నియంత్రించుకోవడం. ఎందుకంటే ప్రతిభ అతడిని స్టార్‌గా మార్చవచ్చు. కానీ క్రమశిక్షణ మాత్రమే అతడిని గొప్ప ఆటగాడిగా నిలబెడుతుంది. ఆగ్రహం క్షణికమే కావచ్చు. కానీ దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది. భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇకపై ఇలాంటి వివాదాల కంటే తన బ్యాటింగ్‌తోనే వార్తల్లో నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
-
U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
-
Manal Chauhan: లెక్కలేసుకుని ఆడాను.. కానీ భారత్‌ను గెలిపించలేకపోయా.. మనాల్ ఎమోషనల్ కామెంట్స్!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
Koti Deepotsavam Day 2: కోటి దీపోత్సవం రెండో రోజు విశేష పూజలు.. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?