Vaibhav Sooryavanshi Tears: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత తుది జట్టులో చోటు దక్కలేదు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో వైభవ్ పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుడ్డోడి స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. అభిషేక్ శర్మతో పాటు సంజు ఓపెనింగ్ చేస్తాడు.
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. భారత టీ20 జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపర్చినా.. జింబాబ్వేపై మాత్రం చెలరేగాడు. దాంతో అఫ్గాన్‌తో తొలి మ్యాచ్‌లోనే అతడికి అవకాశం లభిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ జట్టు కాంబినేషన్‌లో భాగంగా అతడిని పక్కన పెట్టింది. జట్టు కాంబినేషన్‌లో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని టాస్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు కెమెరాలు వైభవ్ సూర్యవంశీ వైపు ఫోకస్ చేయగా.. అతడు నిరాశగా కనిపించాడు. తుది జట్టులో చోటు దక్కకపోవడంతో వైభవ్ ముఖంలో నిరాశ, అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. బుడ్డోడి కంట్లో నీళ్లు తిరుగుతున్నట్లు వీడియోలో కనిపించింది. తీవ్ర నిరాశలో ఉన్న బుడ్డోడి వీడియోలు, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను ఆడాలని ఎంతగానో కోరుకున్నప్పటికీ.. అవకాశం రాకపోవడంతో బాధపడుతున్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వైభవ్‌కు ప్రస్తుతం 15 ఏళ్లే. ఇంత చిన్న వయసులోనే ఐపీఎల్‌లో అదరగొట్టి టీమిండియాలో చోటు సంపాదించిన అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి.
🚨 VAIBHAV SOORYAVANSHI IS SAD !😭
– Despite his brilliant IPL performance, Vaibhav Sooryavanshi was not included in the playing XI for the first T20I against Afghanistan.
– When the camera focused on him, he looked visibly sad and disappointed.
– He appeared to be deeply hurt… pic.twitter.com/fKeI93hQPm— lndian Sports Network (@IS_Netwrk29) September 13, 2026
💔 VAIBHAV’S FACE SAYS IT ALL!
After scoring heavily and still being left out of India’s Playing XI, Vaibhav Sooryavanshi’s disappointment was clearly visible. 😔🇮🇳
📸 Image Credit: FanCode#INDvsAFG #VaibhavSooryavanshi pic.twitter.com/N49iamsUQF
— CricInformer (@CricInformer) September 13, 2026
It’s a very tough call to drop Vaibhav Suryavanshi after he won the Player of the Series award in Zimbabwe.
He made his debut in England when the series was already at a crucial stage, which made it a very tough situation for him. If they really wanted to give Vaibhav a proper… pic.twitter.com/USoG9IpQIH
— Sonu (@Cricket_live247) September 13, 2026

