Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
- వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్
- 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు
- మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Breaks 3 World Records: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బుడ్డోడు.. తొలి సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వరుసగా 14, 13, 15 పరుగులకే పరిమితమైన వైభవ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. జింబాబ్వే పర్యటనలో మాత్రం తన అసలు సత్తా ఏంటో చూపించాడు.
సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్:
గురువారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి భారత విజయానికి బలమైన పునాది వేశాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసిన వైభవ్.. తర్వాతి బంతికే ఔటైనప్పటికీ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లు కలిపి) ఐసీసీ పూర్తి సభ్య దేశాల తరఫున అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల 118 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట 37 ఏళ్లుగా ఉన్న రికార్డును బుడ్డోడు చెరిపేశాడు. సచిన్ 1989లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 16 ఏళ్ల 213 రోజుల వయసులో హాఫ్ సెంచరీ బాదాడు.
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
టీ20ల్లోనూ నయా ప్రపంచ రికార్డు:
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యంత పిన్న వయసులో అర్ధ శతకం చేసిన బ్యాటర్‌గా కూడా వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు గిబ్రాల్టర్ ఆటగాడు లూయిస్ బ్రూస్ పేరిట ఉండేది. అతడు 2021లో మాల్టాపై 16 ఏళ్ల 56 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేశాడు. పూర్తి సభ్య దేశాల పరంగా ఈ రికార్డు అఫ్గానిస్థాన్ స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ (17 ఏళ్ల 296 రోజులు) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో వైభవ్ వీరిద్దరినీ అధిగమించి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఓవరాల్ అంతర్జాతీయ క్రికెట్లో నంబర్ వన్:
అసోసియేట్ దేశాల ఆటగాళ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు నేపాల్ యువ క్రికెటర్ కుశాల్ మల్లా పేరిట ఉండేది. అతడు 2020లో అమెరికాతో జరిగిన వన్డేలో 15 ఏళ్ల 340 రోజుల వయసులో అర్ధ శతకం సాధించాడు. ఇప్పుడు 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే వైభవ్ ఆ ఘనతను అధిగమించి ప్రపంచ రికార్డును తిరగరాశాడు. 15 ఏళ్ల వయసులో బుడ్డోడు బద్దలు కొట్టిన మూడు వరల్డ్ రికార్డులు మరొకరికి సాధ్యం కాకపోవచ్చు. 15 ఏళ్ల వయసులో జాతీయ జట్టులోకి రావడం, మెరుపు హాఫ్ సెంచరీ చేయడం అంటే మాటలు కాదు.
భారత్‌కు దొరికిన మరో సూపర్ స్టార్:
ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేపై ఒక్క ఇన్నింగ్స్‌తోనే తనపై ఉన్న సందేహాలన్నింటికీ సమాధానం చెప్పాడు. ఎలాంటి బెరుకు లేకుండా దూకుడుగా ఆడే తన శైలితో ప్రపంచ క్రికెట్‌కు మరోసారి తన ప్రతిభను పరిచయం చేశాడు. ఈ మూడు ప్రపంచ రికార్డులతో భారత క్రికెట్‌కు మరో భవిష్యత్ సూపర్ స్టార్ సిద్ధమవుతున్నాడనే సంకేతాలు ఇచ్చాడు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!