Site icon NTV Telugu

U-19 ప్రపంచకప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

వెస్టిండీస్‌ ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్‌ వేదికగా కాసేపట్లో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. టైటిల్ కోసం ఇంగ్లండ్, భారత్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో యువ భారత్‌కు ఇది 8వ ఫైనల్ కావడం విశేషం. గతంలో ఏడు సార్లు ఫైనల్ ఆడిన భారత్… నాలుగుసార్లు విజేతగా నిలిచింది. మరో మూడు సార్లు రన్నరప్‌గా నిలిచింది.

Read Also: పోరాడండి.. ట్రోఫీ గెలవండి: భారత కుర్రాళ్లకు హీరో మహేష్‌బాబు పిలుపు

మరోవైపు ఇంగ్లండ్ జట్టు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే టైటిల్‌ను ముద్దాడింది. 1998లో ఇంగ్లండ్ ఈ ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. దీంతో 24 ఏళ్లుగా ఈ టైటిల్ కోసం ఇంగ్లండ్ నిరీక్షిస్తోంది. అయితే యువభారత్ ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లలో దుమ్మురేపి ఫైనల్ చేరుకుంది. సెమీఫైనల్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. దీంతో ఐదోసారి టైటిల్ గెలుచుకునేందుకు యువభారత్ ఉవ్విళ్లూరుతోంది. అన్నిరంగాల్లో టీమిండియా సత్తా చాటుతుండటం ప్లస్ పాయింట్. 8వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సత్తా మన జట్టుకు ఉంది.

భారత్ టీమ్: యశ్ ధూల్ (కెప్టెన్), రఘువంశీ, షేక్ రషీద్, నిషాంత్, రాజ్ బవా, కౌషల్ తంబే, దినేష్ బనా, విక్కీ ఓశ్వాల్, రాజ్‌వర్ధన్, రవికుమార్, హర్నూర్ సింగ్

Exit mobile version