వెస్టిండీస్‌లో అండర్-19 ప్రపంచకప్ కోసం పర్యటిస్తున్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కరోనా బారిన పడ్డారు. వీరితో క్లోజ్ కాంటాక్టులో ఉన్న బౌలర్ ఆరాధ్య యాదవ్‌తో పాటు వసు వత్స్, మానవ్ ప్రకాశ్, సిద్ధార్థ్ యాదవ్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరంతా వరల్డ్ కప్ నుంచి వారు నిష్ర్కమించారు. ఐదుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ప్రస్తుతం భారతజట్టుకు 11 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
Read Also: తొలి వన్డేలో ఓటమి పాలైన భారత్
కెప్టెన్, వైస్ కెప్టెన్ ఐసోలేషన్‌లోకి వెళ్లడంతో ఐర్లాండ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌కు నిశాంత్ సంధు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్ కరోనాతో తప్పుకున్నా ఐర్లాండ్‌పై యువ భారత్ భారీ స్కోరు చేసింది. హర్‌నూర్ సింగ్ (88), రఘు వంశీ(79), రాజ్ భవ(42), రాజవర్థన్(39), నిశాంత్ సింధూ(36) పరుగులతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 307/5 పరుగులు చేసింది. దీంతో ఐర్లాండ్ ముందు 308 పరుగుల టార్గెట్ ఉంచింది. అయితే ఛేదనకు దిగిన ఐర్లాండ్ 39 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ విజయం సాధించింది.