NTV Telugu Site icon

Mumbai Indians Junior: ఆకాశమే హద్దుగా చెలరేగిన చిచ్చరపిడుగు.. 178 బంతుల్లో 508 పరుగులు

Yash Chowde

Yash Chowde

U14 boy Yash Chowde becomes first Nagpur cricketer to score 500 runs In U14: క్రికెట్ చరిత్రలో ఒక చిచ్చరపిడుగు సరికొత్త సంచలనానికి నాంది పలికాడు. ఎవ్వరికీ సాధ్యం కాని రేంజ్‌లో పరుగుల వర్షం కురిపించి, తన పేరిట చారిత్రాత్మక రికార్డ్ లిఖించుకున్నాడు. కేవలం 178 బంతుల్లోనే 508 పరుగులు సాధించాడు. చివరివరకు నాటౌట్‌గా నిలిచాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. అతని పేరు యశ్ చౌదే. వయసు కేవలం 13 సంవత్సరాలే.

Kishan Reddy: తండ్రిని అడ్డుపెట్టుకుని కేటీఆర్‌లా మంత్రిని కాలేదు.. కష్టపడి పైకి వచ్చాం..

ముంబయి ఇండియన్స్ లేటెస్ట్‌గా అంతర్ పాఠశాలల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నాగపూర్‌లో సరస్వతి విద్యాలయ, సిద్ధేశ్వర్ విద్యాలయ జట్ల మధ్య 40 ఓవర్ల మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత సరస్వతి సరస్వతి విద్యాలయ బ్యాటింగ్ చేసింది. ఈ జట్టు తరఫున ఓపెనర్‌గా యశ్ చౌదే దిగాడు. ఇతడు క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. దీంతో 178 బంతుల్లోనే 508 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అందులో 81 ఫోర్లు, 18 సిక్సులు ఉన్నాయంటే.. అతడు ఏ రేంజ్‌లో విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. దేశంలో అంతర్ పాఠశాలల రికార్డులో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.

Cow Dung : పేడండి.. పేడ.. స్వచ్ఛమైన ఆవు పేడ..

యశ్ చౌదే ఆడిన భారీ ఇన్నింగ్స్ పుణ్యమా అని.. సరస్వతి విద్యాలయ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 714 పరుగులు చేసింది. అతనితో పాటు మైదానంలో దిగిన మరో ఓపెనర్ తిలక్ వకోడే 97 బంతుల్లో 127 పరుగులు చేశాడు. ఇక 715 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిద్ధేశ్వర్ విద్యాలయ జట్టు.. అత్యంత దారుణంగా ప్రదర్శించింది. కనీస పోరాటపటిమ కనబర్చకుండా ఘోరంగా విఫలమైంది. కేవలం 5 ఓవర్లలో 9 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కాగా.. ఈ ఇన్నింగ్స్‌తో యశ్ చౌదే అంతర్జాతీయ రికార్డుల్లో స్థానం దక్కించుకున్నాడు. శ్రీలంకకు చెందిన చరిత్ సెల్లెపెరుమ (553) తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 500కి పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా అవతరించాడు.

Guava Benefits : రోజుకో పండు తినండి.. రోగాలకు దూరంగా ఉండండి

అన్ని ఫార్మాట్లలో చూస్తే.. ఇప్పటివరకు 10 మంది ఆటగాళ్లు మాత్రమే 500కి పైచిలుకు పరుగులు సాధించారు. వారిలో ఐదుగురు భారత్ ఆటగాళ్లే ఉన్నారు. ప్రణవ్ ధనవాడే (1009 నాటౌట్), ప్రియాన్షు మోలియా (556 నాటౌట్), పృథ్వీ షా (546), దాదీ హవేవాలా (515) ఇప్పటిదాకా ఈ జాబితాలో ఉండగా.. లేటెస్ట్‌గా యశ్ చౌదే (508 నాటౌట్) చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి వారి సరసన చేరాడు.

Show comments