NTV Telugu Site icon

TNPL 2023: ఇదేందయ్యో ఇది.. ఒక బంతికి రెండుసార్లు డీఆర్‌ఎస్‌! వైరల్ వీడియో

Two Reviews In One Ball

Two Reviews In One Ball

Bowler and Batter both takes reviews in TNPL 2023: తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్) 2023లో మంగళవారం ఆసక్తి సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఓ బౌలర్ ఒకే బంతికి 18 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ విషయం మరిచిపోకముందే టీఎన్‌పీఎల్ 2023లో మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇరు జట్ల ప్లేయర్స్ ఒకే బంతికి రెండుసార్లు డీఆర్‌ఎస్‌ (Two Reviews In One Ball) తీసుకున్నారు. ఓ డీఆర్‌ఎస్‌ బ్యాటర్‌ తీసుకుంటే.. అదే నిర్ణయంపై మరోసారి బౌలర్‌ డీఆర్‌ఎస్‌ తీసుకున్నాడు. ఇందులో ఓ అంతర్జాతీయ ప్లేయర్ కూడా ఉండడం విశేషం. వివరాల్లోకి వెళితే…

టీఎన్‌పీఎల్ 2023లో భాగంగా బుధవారం కోయంబత్తూరులో దిండిగుల్‌ డ్రాగన్స్‌, బా11 ట్రిచ్చి (Ba11sy Trichy vs Dindigul Dragons) మధ్య మ్యచ్‌ జరిగింది. ట్రిచ్చి ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ను భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ (R Ashwin DRS) బౌలింగ్‌ చేశాడు. ఆ ఓవర్‌ చివరి బంతిని యాష్ క్యారమ్‌ బాల్‌ వేయగా క్రీజులో ఉన్న బ్యాటర్ రాజ్‌కుమార్‌ కవర్స్ మీదుగా షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి మిస్‌ అయి కీపర్‌ చేతుల్లో పడింది. బంతి బ్యాట్‌కు తగిలినట్లు సౌండ్‌ రావడంతో.. అశ్విన్ సహా కీపర్‌ అప్పీల్‌ చేసారు. దాంతో అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు.

Adipurush 1st Day Collections: ‘ఆదిపురుష్’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. క్రేజ్ మాములుగా లేదుగా!

అంపైర్‌ నిర్ణయంతో షాక్ అయిన రాజ్‌కుమార్‌ రివ్యూ కోరాడు. రిప్లేలో స్పైక్‌ వస్తున్నప్పటికీ.. బంతికి, బ్యాట్‌కు మధ్య గ్యాప్‌ ఉండడంతో టీవీ అంపైర్‌ ఎస్‌ నిశాంత్‌ నాటౌట్‌ అని ప్రకటించాడు. ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయం ప్రకటించగానే.. ఆర్ అశ్విన్‌ వెంటనే రెండోసారి డీఆర్‌ఎస్‌ కోరాడు. ఇది చూసిన ప్లేయర్స్, ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అశ్విన్‌ ఎందుకు రివ్యూ తీసుకున్నాడో అర్థం కాకా తలలు పట్టుకున్నారు. ఇద్దరు ఫీల్డ్‌ అంపైర్లతో అశ్విన్‌ చర్చించాక.. టీవీ అంపైర్‌ మరోసారి స్పష్టంగా రిప్లై పరిశీలించారు. బంతికి, బ్యాట్‌కు గ్యాప్‌ ఉండడంతో.. బ్యాట్‌ గ్రౌండ్‌కు తాకడంతో స్పైక్‌ వచ్చిందని, నాటౌట్‌ అని టీవీ అంపైర్‌ స్పష్టం చేశాడు.

ఇందుకు సంబందించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు, క్రికెట్ ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అదే సమయంలో లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన బా11 ట్రిచ్చి 19.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఛేదనలో దిండిగుల్‌ 14.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 122 పరుగులు విజయాన్ని అందుకుంది.

Show comments