Site icon NTV Telugu

IND Vs NZ: వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 రద్దు

Ind Vs Nz

Ind Vs Nz

IND Vs NZ: న్యూజిలాండ్‌, టీమిండియా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఈరోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన భారత్- న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. టాస్ వేసే సమయానికి స్టేడియాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఈ కారణంగా టాస్ కూడా పడలేదు. పలు మార్లు గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని నిర్ణయించారు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఐదు ఓవర్ల పాటు అయినా మ్యాచ్ జరుగుతుందని ఆశించిన అభిమానులకు భంగపాటు తప్పలేదు. మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో.. టీమిండియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు స్టేడియంలోనే ఫుట్‌బాల్ ఆడారు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియోను ట్వీట్ చేసింది.

Read Also: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంది వీళ్లకే

కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా పోరాడి సెమీఫైనల్ చేరిన భారత్, న్యూజిల్యాండ్ జట్లు నాకౌట్‌లో వైఫల్యం చెందడంతో టోర్నీ నుంచి నిరాశగా వెనుతిరిగాయి. పాకిస్తాన్ చేతిలో కేన్ విలియమ్సన్ టీం, ఇంగ్లండ్ చేతిలో రోహిత్ సేన ఘోరంగా ఓడిపోయాయి. ఈ ఓటమి బాధను పూర్తిగా మర్చిపోకముందే న్యూజిలాండ్ టూర్ ప్రారంభమైంది. మరి ఈ టోర్నీలో పాండ్యా నాయకత్వంలోని జట్టు ఎలా ఆడుతుందో వేచి చూడాలి. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ ఈనెల 20న ఆదివారం నాడు బే ఓవల్ వేదికగా జరగనుంది.

Exit mobile version