NTV Telugu Site icon

Virat Kohli: నేను ఆర్సీబీకి మద్దతు ఇస్తానని విరాట్‌తో చెప్పాను: ఆస్ట్రేలియా మంత్రి టిమ్‌ వాట్స్

Au Inister

Au Inister

Virat Kohli: ఆస్ట్రేలియా ప్రైమ్‌ మినిస్టర్స్‌ XIతో టీమిండియా వార్మప్ మ్యాచ్‌ ఆడేందుకు రెడీ అయింది. అందులో భాగంగా శుక్రవారం ఆసీస్ ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్‌తో భారత క్రికెటర్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా మినిస్టర్ టిమ్‌ వాట్స్‌ విరాట్‌ కోహ్లీని కలిసినప్పుడు జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. విరాట్‌పై ఉన్న గౌరవంతోనే ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి తాను సపోర్టు ఇస్తున్నట్లు తెలిపారు.

Read Also: Pushpa2 TheRule : పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్ వేదిక మారే అవకాశం..?

ఇక, టీమిండియా ప్లేయర్స్ ను కలవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని ఆస్ట్రేలియా మంత్రి టీమ్ వాట్స్ తెలిపారు. అలాగే, ప్రైమ్‌ మినిస్టర్స్‌ XIతో భారత్ ఈ రోజు (నవంబర్ 30) వార్మప్‌ మ్యాచ్‌ ఆడబోతుంది.. ఈ క్రమంలో వారితో సమావేశం కావడం ఆనందంగా ఉందన్నారు. తాము అంతర్జాతీయ క్రికెటర్‌ను ఎవరిని కలిసినా సముచిత గౌరవం ఇస్తామన్నారు. కానీ, విరాట్‌కు ఆసీస్ క్రికెట్ ఫ్యాన్స్ మనసులో ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. అతడు మా ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌లా ఆడతాడని మంత్రి టిమ్‌ వాట్స్‌ తెలిపారు.

Read Also: Eknath Shinde is unwell: ఏక్‌నాథ్‌ షిండేకు అస్వస్థత.. అసత్య ప్రచారం చేయొద్దని శివసేన వెల్లడి

కాగా, అడిలైడ్ టెస్టుకు ముందు డే అండ్ నైట్‌లో పింక్‌బాల్‌తో వార్మప్ మ్యాచ్‌ ఆడేందుకు రెడీ అయినా భారత్‌కు నిరాశే మిగిలేలా కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.10 గంటలకు భారత్ – ఆస్ట్రేలియా ప్రైమ్‌మినిస్టర్స్‌ XI జట్ల మధ్య మ్యాచ్‌ స్టార్ట్ కావాలి.. కానీ, వర్షం కురుస్తుండటంతో కనీసం టాస్‌ కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే, అంతకు ముందు కాన్‌బెర్రా స్టేడియానికి వచ్చిన ప్రధాని అల్బనీస్‌ భారత క్రికెటర్లతో ఫొటో షూట్‌లో కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో గులాబీ బంతిని ఆసీస్ ప్రధాన మంత్రి చేతలో పట్టుకొని ఉన్నారు.