NTV Telugu Site icon

ఐపీఎల్ 2021 : ముంబైని కేకేఆర్ ఆపగలదా…?

ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ సీజన్ లో ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్ ఆడగా.. అందులో కేకేఆర్ విజయం సాధిస్తే ముంబై మాత్రం పరాజయం పాలైంది. దాంతో ఈ రెండు మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. అయితే మొదటి మ్యాచ్ కు అందుబాటులో లేని ముంబై జట్టు స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ లో ఆడనున్నట్లు తెలుస్తుంది. కానీ హైదరాబాద్ పైన బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో రాణించిన కేకేఆర్ ముంబైని ఆపగలదా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే గతంలో ఈ రెండు జట్లు 27 సార్లు తలపడగా అందులో ముంబై 21 మ్యాచ్ లలో విజయం సాధిస్తే కేకేఆర్ కేవలం ఆరు మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. అలాగే ప్రస్తుతం కోల్‌కత జట్టులో ఉన్న హిట్టర్ రస్సెల్ మరియు స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ కూడా ఫామ్ లో లేకపోవడం ఆ జట్టును కలవరపెడుతుంది. హార్దిక్ కూడా బౌలింగ్ చేయలేకపోవడం ఇటు ముంబై జట్టుకు కొంత నష్టమే. అయితే చూడాలి మరి ఈరోజు మ్యాచ్ లో ఎవరు విహాయం సాధిస్తారు అనేది.