NTV Telugu Site icon

ఆసీస్ టెస్ట్ కెప్టెన్ గా తప్పుకున్న పైన్…

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు యొక్క మరో కెప్టెన్ వివాదంలో చిక్కుకొని ఆ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. 2018 లో సౌత్ ఆఫ్రికా పైన బాల్ టాంపరింగ్ వివాదంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆ జట్టు టెస్ట్ వికెట్ కీపర్ టిమ్ పైన్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. కానీ ఇప్పుడు అతను కూడా ఓ వివాదంలో చిక్కుకొని ఈరోజు ఆ బాధ్యతలకు రాజీనామా చేసాడు. అయితే టిమ్ పైన్ 2017 లో తోటి మహిళాకు అసభ్యకరమైన ఫోటోలు, మెసేజ్ లు పంపాడని ఈ మధ్య వాదనలు వచ్చాయి.

అయితే దాని పైన విచారణ చేప్పట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా అది నిజమే అని తేల్చింది. దాంతో తాను ఇక ఆసీస్ జట్టుకు కెప్టెన్ గా ఉండటం సరికాదు అంటూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అయితే ఈ నిర్ణయం తనకు కష్టంగా ఉన్న కూడా… ఆసీస్ జట్టుకు, తన ఫ్యామిలీకి అలాగే క్రికెట్ కు మంచిది అని చెప్పాడు. కానీ వచ్చే నెల 8 నుండి ఆస్ట్రేలియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. దాంతో ఆ సిరీస్ లో ఆసీస్ ను ఎవరు నడిపిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.