Cricketers Marriage: శ్రీలంక క్రికెట్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకేరోజు ముగ్గురు క్రికెటర్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. శ్రీలంక క్రికెటర్లు కసున్ రజిత, చరిత్ అసలంక, పథుమ్ నిశాంక సోమవారం నాడు కొలంబోలో వేర్వేరు చోట్ల వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఫొటోలను ఆ దేశ క్రికెట్ బోర్డు ట్విటర్‌లో పోస్టు చేసి శుభాకాంక్షలు తెలిపింది. వీరంతా ప్రస్తుతం అప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడుతున్నారు. మొదటి వన్డేలో అఫ్ఘనిస్తాన్ గెలవగా, రెండో వన్డే వర్షంతో రద్దయ్యింది. మూడో వన్డే బుధవారం జరగనుంది. ఆ రోజు ఈ క్రికెటర్లు తమ జట్టుతో కలుస్తారు.
Read Also: Minister Roja: కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి రోజా.. వీడియో వైరల్
కాగా పథుమ్ నిశాంక ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 88 సగటుతో 88 పరుగులు చేశాడు. మొదటి వన్డేలో నిశాంక 85 పరుగులతో రాణించాడు. అయితే మరో క్రికెటర్ అసలంక మాత్రం రెండు వన్డేలలో కలిపి 10 పరుగులు మాత్రమే చేశాడు. బుధవారం జరిగే మూడో వన్డేలో రాణించాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు. కసున్ రజిత తొలి రెండు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ 4.57గా నమోదైంది. వీళ్లంతా బుధవారం మూడో వన్డేలో పాల్గొనాల్సి ఉండటంతో ఇప్పుడే హనీమూన్‌కు వెళ్లే అవకాశం లేదు.
Congratulations to Charith Asalanka, Pathum Nissanka and Kasun Rajitha! 💍🎉 pic.twitter.com/qlUZKtOMVG
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 28, 2022