Site icon NTV Telugu

భారీ స్కోరు చేసిన సౌతాఫ్రికా

సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న మొద‌టి వ‌న్డే మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా రాణించారు. భాత‌ర బౌలర్లను ఎదుర్కొంటు సుల‌వుగా బౌండ‌రీల మీద బౌండరీలు బాదారు. సౌత్ ఆఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 296 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్ ఈ వ‌న్డే లో విజ‌యం సాధించాలంటే 297 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది. కాగా సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు ఇద్దరూ సెంచ‌రీ న‌మోదు చేశారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా 110 (143) ప‌రుగుల‌ను 8 ఫోర్లు తో కొట్టాడు. అలాగే రాస్సి వాన్ డెర్ డ‌స్సెన్ కేవ‌లం 96 బంతుల్లో 129 ప‌రుగులు చేశాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్ లో డ‌స్సెన్ 9 ఫోర్లు, 4 సిక్స్ ల‌ను కొట్టాడు.

Read Also: ఇండియా టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా రిటైర్మెంట్‌

ఈ ఇద్దరి బ్యాటింగ్‌కు భారత బౌలర్లు చేతులెత్తేశారు. నాలుగో వికెట్ కు బావుమా, డ‌స్సెన్‌లు ఏకంగా 204 ప‌రుగుల‌ను జోడించి సౌత్ ఆఫ్రికా భారీ స్కోరు చేయడానికి కారణం అయ్యారు. శార్ధుల్ ఠాకూర్ త‌న 10 ఓవర్లలో ఏకంగా 72 ప‌రుగుల‌ను స‌మ‌ర్పించుకున్నాడు. అలాగే భువనేశ్వర్‌ కూడా 10 ఓవర్లలో 64 ప‌రుగుల‌ను ఇచ్చాడు. బుమ్రా 2 వికెట్లు తీశాడు. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 53 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు. మరో బౌలర్‌ యజేవేంద్ర చాహల్‌ 10 ఓవర్లు వేసి 53 పరుగులు సమర్పించుకున్నాడు.

Exit mobile version